Great Memory in Lokesh Padayatra: పాదయాత్రలో అపురూప దృశ్యం.. లోకేశ్ సాయంతో కుటుంబం నిలబడిందన్న మహిళ - తెలుగుదేశం నేత నారా లోకేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Lokesh Provides Financial Assistance: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర 187వ రోజూ ఉత్సాహంగా సాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి శివారులోని డాన్ బాస్కో పాఠశాల నుంచి యాత్ర కొనసాగించారు. లోకేశ్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. తాడేపల్లిలో నివాసముంటోన్న రెహానాకు ఏడాది క్రితం భర్త మరణించారు. చంటిబిడ్డతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో స్థానిక నాయకుల ద్వారా తమ కష్టాలను యువనేత లోకేశ్‌కు విన్నవించుకుంది. పాదయాత్రకు బయలుదేరే నెలముందు ఆమెకు టిఫిన్ బండి సమకూర్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేశ్ ఆకస్మికంగా రెహానా టిఫిన్ బండి వద్దకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ దయతో ప్రస్తుతం నెలకు రూ.30వేలు సంపాదిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆనందంగా చెబుతూ యువనేతకు అల్పాహారాన్ని అందజేసింది. గతంలో రూ.300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.800 అయిందని చెప్పింది. తాను నివసించే ఇంటికి పట్టాలేదని తెలిపింది. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి పట్టాతోపాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పి యువనేత ముందుకు సాగారు.