APMDC minings: మంగంపేట మైనింగ్​పై గ్రామసభ..3 నెలల్లో పునరావాసం కల్పిస్తామని కలెక్టర్ హామీ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 15, 2023, 7:33 PM IST

Andhra Pradesh Mineral Development Corporation: అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ బాధితులతో ఈ రోజు మంగంపేట నందు కాపుపల్లి, అరుంధతివాడ, హరిజనవాడ గ్రామాలకు ఏపీఎండీసీ మైనింగ్ కార్యకలపాల కోసం భూసేకరణ విషయం మీద ఆయా గ్రామస్థులతో నిర్వహించిన గ్రామ సభలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో కాపుపల్లి, హరిజనవాడ, అరుంధతివాడ మూడు గ్రామాలను ఇక్కడి నుండి తరలించి వారికి తగిన పరిహారం చెల్లించి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడు గ్రామాల బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు నెలల్లోనే మీకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ డేంజర్ జోన్ గ్రామాల ప్రజలకు అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పిస్తామని అన్నారు. గ్రామ ప్రజలకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డేంజర్ జోన్ గ్రామ ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.