జగనన్న కాలనీల పేరిట మోసం - వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామన్న లబ్ధిదారులు - Nellore District News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 7:06 PM IST
Government Neglect of Jagananna Colonies : జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం లేఅవుటు లోతట్టు ప్రాంతంలో ఉంది. ఇటువంటి ప్రాంతాన్ని జాతీయ రహదారి వరకు ఎత్తు లేపకుండానే జగనన్న కాలనీకి కేటాయించారు. కొద్దిపాటి వర్షాలకు రోడ్లు బురదమయంగా మారుతున్నాయని లబ్ధిదారులు వాపోయారు. ఇళ్లు నాసిరకంగా నిర్మించారని ఆవేదన వ్యక్తంచేశారు. సొంతగా ఇంటిని నిర్మించుకుంటే బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గోడు వెల్లబుచ్చారు. ఇంటి బయట అందంగా తలుపులు బిగించారని.. లోపల పనులు చేయలేదని మండిపడ్డారు.
జగనన్న కాలనీలోకి వెళ్లి లబ్దిదారులను పలకరిస్తే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేదల ఇళ్లు నాశనం అవుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న కాలనీ దుస్థితిని చూడటానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు రావలని కోరుతున్నారు. మూడు నెలల్లో ఎలాగైనా ఓట్ల కోసం మా లేఅవుట్లలోకి వస్తారని.. అప్పుడు నిలదీసి అడుగుతామని లబ్ధిదారులు అంటున్నారు. జగనన్న కాలనీల పేరిట తమను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.