GOs to be uploaded in online: జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టండి.. అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశం - జిఓలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి
🎬 Watch Now: Feature Video
GOs to be uploaded online: జీవోలను ఆన్ లైన్ లో పెట్టాలని ప్రభుత్వం అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలన్నీ ఇక నుంచి జారీ చేసే ఉత్తర్వులన్నిటినీ ఇక నుంచి ఏపీ గెజిట్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వ శాఖలు జారీ చేసిన జీవోలను ఇక నుంచి ఏపీ గెజిట్ డాట్ సీజీజీ డాట్ జీవోవి డాట్ ఇన్ లో పొందు పర్చాలని ఆదేశాల్లో పేర్కోంది. జీవో రిజిస్టర్ లో నమోదైన అన్ని జీవోలనూ ఏపీ గెజిట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సిందిగా సూచనలు ఇచ్చింది. 2023 జనవరి 10 తేదీ నుంచి ఇప్పటి వరకూ జారీ చేసిన జీవోలను మే 22 తేదీ నాటికల్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఉత్తర్వులను ఏపీ గెజిట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసినట్టు సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది.