ETV Bharat / state

ఫలించిన అగ్రిగోల్డ్​ బాధితుల నిరీక్షణ - ఆస్తుల పంపిణీకి మార్గం సుగమం - AGRIGOLD ASSETS DISTRIBUTION

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు మార్గం సుగమం - ఈడీ జప్తు చేసిన ఆస్తుల పంపిణీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు అనుమతి

AgriGold_assets_Distribution
AgriGold_assets_Distribution (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 7:23 AM IST

Court Allows Distribution of Agrigold Assets to Victims: అగ్రిగోల్డ్ బాధితుల ఏళ్ల నిరీక్షణ ఫలించింది. వారికి న్యాయం చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈడీ జప్తు చేసిన సంస్థ ఆస్తుల్ని బాధితులకు పంచేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.6 వేల కోట్ల ఆస్తులను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం గత ఏడాది డిసెంబర్‌లో నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్‌ దాఖలు చేయగా అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఏపీ సీఐడీకి బదిలీ చేయనున్నారు.

అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ప్రజల నుంచి వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా రాష్ట్రాల్లో 2015లో కేసులు నమోదయ్యాయి. ఏపీలో నిధుల మళ్లింపు కోణం ఉండటంతో 2018లో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అప్పటి మార్కెట్‌ ప్రకారం సంస్థకు చెందిన రూ.4,141 కోట్ల 20 లక్షల రూపాయల విలువైన 2,310 ఆస్తులను జప్తు చేసింది. వీటిలో 2,254 ఆస్తులు ఏపీలో ఉండగా తెలంగాణలో 43, కర్ణాటకలో 11, ఒడిశాలో 2 ఉన్నాయి. అప్పటికే ఏపీ సీఐడీ కూడా ఈ ఆస్తులను జప్తు చేసింది. దీంతో తాము జప్తు చేసిన ఆస్తులను బాధితులకు అందించేలా అనుమతివ్వాలంటూ ఈడీ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా సమ్మతించింది.

ఫలించిన అగ్రిగోల్డ్​ బాధితుల నిరీక్షణ - ఆస్తుల పంపిణీకి మార్గం సుగమం (ETV Bharat)

ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు పంపిణీ: మొత్తం 4,141 కోట్ల 20 లక్షల రూపాయల ఆస్తుల్లో నుంచి 3,339 కోట్ల విలువైన ఆస్తులను ఏపీ సీఐడీకి బదిలీ చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్టు-1999 కింద ఈ ఆస్తులను సీఐడీ వేలం వేసి వచ్చిన డబ్బును డిపాజిటర్లకు పంపిణీ చేయనుంది. అయితే ఏపీ ప్రభుత్వం గతంలో చాలా మంది బాధితులకు సొంత నిధులకు అందజేసింది. ఇప్పుడు ఈడీ బదిలీ చేసిన ఆస్తులను విక్రయించిన తర్వాత తాను అందజేసిన నిధులను మినహాయించుకొని మిగతావి చెల్లించనున్నట్లు తెలుస్తోంది.

చివరకు 'ఖాళీ'ఫ్లవరే - ధర లేక పంటను దున్నేసిన రైతు

వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ - అక్రమాలపై సిట్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.