Golden Urn Missing in Gudiwada: ఆలయ శిఖరంపై బంగారు కలశం మాయం.. రంగంలోకి పోలీసులు - దేవస్థానం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2023, 1:54 PM IST
Golden Urn Missing in Gudiwada: ఆలయ శిఖరంపై అమర్చిన బంగారు కలశం అదృశ్యమైంది. దాదాపు కిలో బరువైన బంగారాన్ని తాపడం చేయించిన కలశం కావడంతో ఎవరైనా అపహరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడివాడ రూరల్ మండలంలోని శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి దేవాలయ శిఖరంపై బంగారు కలశ తాపడం మాయం కావడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. సిద్ధాంతం గ్రామంలో గల బాాలా త్రిపుర సుందరీ దేవి దేవస్థాన శిఖర కలశంపై కేజీకి పైగా బరువు ఉన్న బంగారు తాపడాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. శనివారం దేవస్థానం సిబ్బంది గమనించే సరికి బంగారు తాపడం మాయమైంది. దీంతో దేవస్థాన ధర్మకర్తల కమిటీ (Devasthanam Trustees Committee) సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన గుడివాడ రూరల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. బంగారు తాపడాన్ని దొంగలు ఎత్తుకెళ్లారా, లేదా గాలికి ఎగిరిపోయిందా అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కేజీ బంగారు తాపడం మాయం కావడం గుడివాడలో సంచలనం సృష్టించింది.