Former Minister Ganta Comments On TDP-Janasena Pottu : టీడీపీ - జనసేన పొత్తుతో వార్ వన్​సైడే.. : మాజీ మంత్రి గంటా - ఏపీ ప్రధానవార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 2:04 PM IST

Updated : Sep 15, 2023, 7:05 PM IST

Former Minister Ganta Comments On TDP-Janasena Pottu : రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి సాగుతామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించాలనుకున్న మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీపి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 

టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే లాండ్ స్లైడింగ్ విక్టరీ ఈ కూటమికి ఖాయమైందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ కూటమి చారిత్రక అవసరమన్న ఆయన... క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను సమన్వయ కమిటీ (Coordination Committee) తేలిగ్గా పరిష్కరించగలుగుతుందని చెప్పారు. చంద్రబాబు (Chandrababu)పై కక్ష పూరితంగానే కేసులు నమోదు చేసి ఖైదు చేశారని తెలిపారు. దేశ చరిత్రలో ఎవరైనా ఆరెస్టయితే వారి వల్ల నష్టపోయిన వారు జరిగిన నష్టాన్ని వివరించిన ఘటనలు ఉన్నాయి తప్ప... చంద్రబాబు వల్ల తాము లబ్ధి పొంది ఉద్యోగాలు సంపాదించుకున్నామని చెబుతున్న ఘటనలు మనం చూస్తున్నామని గంటా పేర్కొన్నారు. జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రకటన రాష్ట్ర రాజకీయాలను మార్చేదిగా చెబుతున్న గంటా శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి.

Last Updated : Sep 15, 2023, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.