తుపాను ప్రభావంతో పాపికొండలకు నిలిచిన ప్రయాణం - బోట్ల నిలిపివేత
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 4:19 PM IST
|Updated : Dec 6, 2023, 7:48 AM IST
Gandi Pochamma Temple to Papikondalu Boats Stopped: మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పర్యాటక ప్రాంతాలకు రావాణా సౌకర్యాలను అధికారులు నిలిపివేస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు పర్యాటక ప్రాంతాలపై అధికారులు అంక్షలు విధిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లా నుంచి పాపికొండలకు వెళ్లే బోట్లను నిలిపివేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లను అధికారులు నిలిపివేశారు.
ఇక్కడి నుంచి ప్రతిరోజు మూడు బోట్లు వెళ్తుంటాయి. అంతేకాకుండా పాపికొండల నుంచి కూడా 3 బోట్లు వస్తుంటాయి. అయితే తుపాను కారణంగా అధికారులు ఈ బోట్లను నిలిపివేశారు. వర్షాల కారణంగా రంపచోడవరం మన్యంలో పర్యాటక ప్రాంతాలకు అధికారులు అంక్షలు విధించారు. ప్రమాదాలు తావివ్వకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రంపచోడవరం మండలంలోని ఈతలపాడు నుంచి గోపవరం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోవలు నిలిచిపోవడంతో ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు.