Former Minister Bhuma Akhila Priya Hunger Strike Broken by Police: భూమా అఖిల ప్రియ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. - ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అఖిల ప్రియ నిరాహార దీక్ష
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 10:47 AM IST
Former Minister Bhuma Akhila Priya Hunger Strike Broken by Police: నంద్యాలలో టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. అరెస్టు చేసిన ప్రాంతమైన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద రెండు రోజుల క్రితం అఖిలప్రియ దీక్షకు పూనుకున్నారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు.
దీక్ష సమాచారం తెలుసుకున్న పోలీసులు.. దీక్ష శిబిరం వద్దకు చేరుకుని బలవంతంగా ఆమె దీక్షకు భగ్నం కలిగించారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి బలవంతంగా ఆళ్లగడ్డవైపు తరలించారు. ఆ తర్వాత పటిష్ట బందోబస్తు మధ్య ఆమె నివాసానికి చేర్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆమె అందుకు అంగీకరించకపోగా.. ఇంట్లోకి వెళ్లేందుకు నిరాకరించారు. తన దీక్ష భగ్నం కాలేదని పోలీసులు అనుమతివ్వకుంటే.. వాహనంలోనే తన దీక్షను కొనసాగిస్తానని పట్టుబట్టారు. లేదంటే ఇంటిబయటే కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. దీనికి పోలీసులు నిరాకరించగా.. తన అరెస్టు అన్యాయమని తన ప్రాథమిక హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసుల చర్యలు నంద్యాలలోని కొందరు రాజకీయ నేతల ప్రేరేపిత చర్యలేనని ఆమె ఆరోపించారు.