Balineni met CM Jagan: పార్టీలో ఇబ్బందులపై సీఎంతో చర్చించా: మాజీ మంత్రి బాలినేని - Tadepalli Camp Office
🎬 Watch Now: Feature Video

Balineni Srinivas Reddy met CM Jagan: జిల్లాలో నెలకొన్న వివిధ అంశాలపై ముఖ్యమంత్రి జగన్తో చర్చించానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బాలినేని భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. సీఎంతో భేటీ అనంతరం మాట్లాడిన బాలినేని.. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించినట్లు వెల్లడించారు. అన్ని అంశాలనూ ముఖ్యమంత్రితో చర్చించినట్టు తెలిపారు. ప్రొటోకాల్ అనేది పెద్ద అంశం కాదన్నారు. మంత్రి పదవినే వదులుకుని వచ్చిన తనకు ప్రోటోకాల్ గురించి ఇబ్బంది ఏముంటుందన్నారు. రీజినల్ కోఆర్డినేటర్ పదవి గురించి కూడా తమ మధ్య చర్చ జరగలేదని చెప్పారు. కావాలనే పార్టీలోని కొందరు మీడియాకు లీక్ ఇచ్చి దుష్ప్రచారం చేశారని బాలినేని ఆరోపించారు. తానెప్పుడూ పార్టీపై అలగలేదని చెప్తూ.. పార్టీలోని కొందరు ఇబ్బందులు పెట్టారని ఆక్షేపించారు. నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారని వెల్లడించారు. తన నియోజకవర్గంలో 200 కోట్లతో ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేస్తున్నామని బాలినేని వివరించారు.