శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 2:05 PM IST
Former CJI Justice NV Ramana Couple Visited Mallanna Swami: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. వీరికి భ్రమరాంబ అతిథి గృహం వద్ద దేవస్థానం ఈవో పెద్దిరాజు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఆలయ మహా ద్వారం వద్ద జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ.. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామివార్లకు శుక్రవారం ఊయల సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేష పుష్పాలంకరణలతో ఊయలపై కొలువుదీర్చారు. ఆర్చకులు షోడశోపచార పూజలు చేశారు. అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గ మాల, సహస్ర నామ పూజలు, స్వామివారికి సహస్ర నామార్చనలు జరి పారు. అనంతరం విశేష పుష్పార్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు.