Foreign Cigarettes Seize: విశాఖలో రూ.27 లక్షల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్ - ap news
🎬 Watch Now: Feature Video
Foreign Cigarettes Seize in vishakha: విశాఖ నగరంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి భారీగా విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు. డాబా గార్డెన్స్‌లోని జపాన్ ప్లాజా, సింగపూర్ ప్లాజాతో పాటు మరో రెండు కిరాణా షాపులలో దాడులు నిర్వహించి విదేశీ సిగరెట్లును స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. సుమారు రూ.27 లక్షల విలువ చేసే విదేశీ, స్వదేశీ సిగరెట్లు సీజ్ చేశామని చేశామని,.. తమకు వచ్చిన సమాచారం మేరకు నాలుగు షాపుల్లో రైడ్ నిర్వహించి విదేశీ సిగరెట్లును పట్టుకున్నామన్నారు. చెన్నై, విజయవాడ నుంచి సిగరెట్లను తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అమ్మకందారులు చెబుతున్నారన్నారు. వీటిలో కొన్ని స్వదేశీ సిగరెట్లు ఉన్నాయి కానీ ఎటువంటి బిల్లులు లేవని.. విదేశీ సిగరెట్లలో నికోటిన్ శాతం ఎక్కువగా ఉంటుందని అన్నారు. విదేశీ సిగరెట్లు త్రాగడం వలన వేగంగా అనారోగ్య సమస్యలు వస్తాయని, విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. నగరంలో ఈ దాడులను ఇంకా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
TAGGED:
Foreign Cigarettes Seize