Konaseema floods effect కోనసీమవాసుల వెతలు..! ఓవైపు వరద బురద.. మరోవైపు పాములు బెడద!
🎬 Watch Now: Feature Video
floods effect in Ambedkar Konaseema District : ఓవైపు వరద బురద.. మరోవైపు పాములు బెడద... డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం పరిధిలోని 20 లంక గ్రామాలు వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరద నీరు పోవడంతో ఇంటి పరిసరాలు, రహదారులు బురదమయంగా మారాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు అంటున్నారు. దీనికి తోడు వరద నీటిలో కొట్టుకు వచ్చిన పాములు బుసలు కొడుతున్నాయి... వరద నీటిలో కొట్టుకు వచ్చిన తాచుపాము ఠాణేలంక పెదపేటలో నివాస గృహాల వద్ద కలకలం రేపింది. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురి అయ్యారు. పామును చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు.. పాముని దైవంగా భావించి పాలు పోసి, కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఎంతోమంది వీడియోలు, ఫొటొలు తీస్తున్న పాము బెదరకుండా సుమారు మూడుగంటల పాటు పడగవిప్పి బుసలు కొట్టింది. తర్వాత దానంతట అదే దూరంగా ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఉన్న మహిళను పాము కాటు వేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. తమ ప్రాంతాల్లో బురద తొలగింపు చర్యలను చేపట్టాలని గ్రామస్థులు అధికారులను వేడుకుంటున్నారు.