Flexies Tension in Vinukonda: వినుకొండలో నారా లోకేశ్ యువగళం.. దుమారం రేపుతున్న వైసీపీ ఫ్లెక్సీలు - యువగళం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ
🎬 Watch Now: Feature Video
YCP Flexies In Vinukonda During Yuvagalam: పల్నాడు జిల్లా వినుకొండలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో అధికార పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ వినుకొండకు విచ్చేశారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణం అంతా ఫ్లెక్సీలతో పసుపుమయమైంది. ఈ క్రమంలో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫొటోతో కూడిన పలు హోర్డింగులు అకస్మాత్తుగా పట్టణమంతా వెలిశాయి. వాటి మీద ఎమ్మెల్యే ఫొటోతో పాటు "వైనాట్ 175", "అభివృద్ధి పథంలో మన వినుకొండ" అని రాసి ఉన్నాయి. వినుకొండలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు లోకేశ్ పాదయాత్ర.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పేరుతో ఫ్లెక్సీలు వెలియడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.