'దాడి చేసింది వారు - అరెస్టు చేసింది మమ్మల్ని' - తిరునాళ్లలో ఫ్లెక్సీ వివాదం - gurajala flexi dispute
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-12-2023/640-480-20365610-thumbnail-16x9-flexi-dispute-between-tdp-and-ysrcp-members-in-tirunallu.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 1:04 PM IST
|Updated : Dec 27, 2023, 1:25 PM IST
Flexi Dispute Between TDP and YSRCP Members In Tirunallu: తిరునాళ్లలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొంది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా తెలుగుదేశం వర్గీయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని కొందరు వైసీపీ కార్యకర్తలు మంగళవారం రాత్రి చించివేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం వర్గీయులు వైసీపీ బ్యానర్లు కొన్నింటిని చించారు.
TDP Members Arrested in Palnadu: దీంతో ఇరువర్గాల వారు గుంపులుగా రావడంతో ఘర్షణ నెలకొని ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. టీడీపీ వర్గీయుల ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నిలిపి వేసి నలుగురిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. మేం ఏర్పాటు చేసుకున్న బ్యానర్లను చింపడమే కాకుండా మాపైన దాడి చేసిన వైసీపీ నేతలను వదిలేసి మమ్మల్ని స్టేషన్కు తీసుకెళ్లడం న్యాయమా అని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లెక్సీలు ఎందుకు చింపారని వైసీపీ నేతలను అడగితే మాపైనే తిరగబడ్డారని వారు తెలిపారు.