చోరీలకు పాల్పడుతున్న అత్తిలి ముఠా - 3 వాహనాలు, 5లక్షల సొత్తు స్వాధీనం - attili latest robbery news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 3:47 PM IST
|Updated : Dec 15, 2023, 4:29 PM IST
Five Thieves Arrested in Robbery Cases: మన ఊరు అత్తిలి కాబట్టి అత్తిలి సత్తిబాబులా మనం ఎందుకు ఉండకూడదు? అని అనుకున్నారో ఏమో?!. విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు మాదిరిగా కంటికి కనిపించిన వస్తువులన్నీ మాయం చేద్దామనుకుని చివరికి పోలీసులకు చిక్కారు. ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అత్తిలి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. విక్రమార్కుడు సినిమా కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. దాన్ని స్పూర్తిగా తీసుకున్న వీరీ జీవితం అట్టర్ ప్లాప్ అయింది.
వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు లక్షల విలువ గల బ్యాటరీలు, 3 స్కూటర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శరత్ కుమార్ తెలిపారు. నిందితులు అత్తిలి పరిసర ప్రాంతాలకు చెందిన రమణ, భరణి, ప్రకాష్, శివ సాయి, అశోక్ బాబుగా గుర్తించామన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు బృందానికి డీఎస్పీ నగదు రివార్డు అందజేశారు.
TAGGED:
దొంగతనం తాజా వార్తలు