Teachers Suspend: విద్యార్ధులపై వేధింపులు.. ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెన్షన్ - సీతారామరాజు జిల్లాలో ఉపాధ్యాయుల సస్పెన్షన్
🎬 Watch Now: Feature Video
Five Teachers Were Suspended: అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపుల కారణంగా ఐదుగురు ఉపాధ్యాయులను కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా విద్యాశాఖ అధికారి సలీం భాషా సస్పెండ్ చేశారు. మూడు నెలల కిందట ఓ ప్రైవేట్ ట్రస్ట్ విద్యార్థులకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ నివేదికను విద్యాశాఖ ఉన్నత అధికారులకు అందించారు దీనిపై విచారణ చేపట్టిన డీఈవో కలెక్టర్ త్వరలో ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
విద్యార్థులను వేధిస్తున్నారనే కారణంతో ఐదుగురు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జెడ్డంగి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు నెలల కిందట ఓ స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీని ప్రకారం విద్యార్థినులకు జరిగేటటువంటి అన్యాయాలు, వేధింపులపై అవగాహన కల్పించారు. అలాగే పాఠశాలలో ఓ బాక్స్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు పెట్టే తయారు చేశారు. విద్యార్థినిలు ఎవరైనా మీపై అసభ్యకరమైన విధంగా ఉంటున్నారా, తప్పుడుగా ప్రవర్తిస్తున్నారా, వేధింపులకు గురి చేస్తున్నారా అనే తదితర అంశాలపై విద్యార్థినిల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
దీని పరిశీలించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యాశాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారని అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవో సునీల్ భాషా విచారించారు. మహిళ ఉపాధ్యాయులు, ఎంఈవో సహకారంతో బాలికల ఇళ్లకు పంపించారు. విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు ఈ అంశంపై కూడా చెప్పడంతో నిజం నిరూపణ అయిందని డీఈవో చెప్పారు. గతంలో విద్యార్థినిలు ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదు చేసినప్పటికీ దీనిపై స్పందించలేదని చెప్పారు. విచారణ నిరూపణ అయినందున ఐదుగురు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు డీఈవో ప్రకటించారు.