Fire from a parking car పార్కు చేసిన కారులో మంటలు - Car accident in Khajaguda
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16750538-1100-16750538-1666785176173.jpg)
Fire from a parking car: తెలంగాణలో కొద్దిరోజులుగా వాహనాల నుంచి మంటలు రావడం.. వెళ్తున్న కార్లు అగ్నికి ఆహుతి కావడం లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఖాజాగూడ దిల్లీ పబ్లిక్ స్కూల్లో పార్క్ చేసిన కారు నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు గమనించి మంటలు అదుపుచేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. కారు నుంచి ఎగసిపడుతున్న అగ్నికి దగ్గరికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోయారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST