Fire Accident in Ongole: ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం.. గోడౌన్లో చెలరేగిన మంటలు - Firenjans
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 11:06 AM IST
|Updated : Oct 24, 2023, 11:13 AM IST
Fire Accident in Ongole: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పప్పు బజారులో ఉన్న సునీల్ కాయర్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ అలుముకుంది. దీనివల్ల పక్కన నివాస సముదాయాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. భారీఎత్తున ఎగసిపడిన మంటలు(Massive Fires).. వ్యాప్తి చెందడంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే దీనిపై అగ్నిమాపక సిబ్బంది(Firefighters)కి సమాచారం అందించారు. ప్రమాద సమాచారం తెలిసి రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. చాలాసేపు శ్రమించి ఫైరింజన్ల(Firenjans)తో మంటలు ఆర్పివేశారు.
సునీల్ కాయర్ గోడౌన్ ఘటనతో భారీగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Electrical Short Circuit) వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. సునీల్ కాయర్ గోడౌన్లో చెలరేగిన ఈ మంటలు.. మూడు ఫ్లోర్లకు వ్యాపించాయి. భవనం లోపల ఉన్న తాళ్లు, సవార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మనుషులెవరూ చిక్కుకోలేదని తెలిసింది.