షార్ట్ సర్క్యూట్తో దుకాణం దగ్ధం - అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే భారీగా ఆస్తి నష్టం - అనంతలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 1:02 PM IST
Fire Accident in Mattress Store At Anantapur : అనంతపురం నగరంలో షార్ట్ సర్క్యూట్ వల్ల పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సప్తగిరి సర్కిల్ కూడలిలో ఉన్న పరుపుల దుకాణంలో రాత్రి వేళ దుకాణం నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానిక ప్రజలు గమనించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
Short Circuit Accidents in Anantapur : అగ్నిమాపక సిబ్బంది దుకాణం తలుపులు పగలకొట్టి ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే సుమారుగా అన్ని పరుపులు కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ మధ్యనే కొత్త పరుపులు తెచ్చానని, దాదాపు 5 లక్షలు రూపాయల ఆస్థి నష్టం జరిగినట్లు షాపు యజమాని చెప్పారు. తనకు తగిన సహాయం చేయాలని దుకాణాదారుడు కోరారు. దుకాణం యజమానులు ఇంటికి వెళ్లే సమయంలో దుకాణాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది సూచించారు.