సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం - fire accidents in hyderabad
🎬 Watch Now: Feature Video
Fire accident at Swapnalok Complex: దక్కన్‌మాల్ ఘటన మరువకముందే సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగిసిపడుతున్నాయి. భవనం లోపల కొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంత్రి తలసాని ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హైదరాబాద్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగర ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలే వేసవికాలం ఎక్కడ ఎప్పుడు అగ్నిప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందతున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న దక్కనమాల్ అగ్నిప్రమాద ఘటన మరవకముందే తాజాగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహంకాళీ పీఎస్ పరిధిలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ భవనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ మూడో అంతస్తులో చెలరేగిన మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.