Nidhi Agarwal హరిహర వీరమల్లు గురించి నిధి అగర్వాల్ ఏం చెప్పిందంటే..? - hara hara veera mallu movie news
🎬 Watch Now: Feature Video
Film actress Nidhi Agarwal in Visakhapatnam: విశాఖలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. రాంనగర్లో టైం ల్యాండ్ బ్రాండెడ్ వాచ్ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. నిధి అగర్వాల్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలి వచ్చారు. నిధి అగర్వాల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వాచ్ స్టోర్‌లో కూడా పలువురు నిధితో ఫోటోలు తీసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు తనని ఎంతగానో ఆదరించారని.. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. నిధి అగర్వాల్‌కు విశాఖ అభిమానులు శుభాభినందనలు తెలిపారు. అదే విధంగా నిధి అగర్వాల్‌కి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ గురించి అడగగా.. మరికొంత షూటింగ్ ఉందని ఆమె తెలిపారు. త్వరలోనే అది కూడా పూర్తవుతుందని అన్నారు. పవన్ కల్యాణ్‌తో షూటింగ్ ఒక డ్రీమ్‌లా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ సరసన నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు నిధి అగర్వాల్ చెప్పారు.