Female Maid Murdered in Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో పనిమనిషి దారుణ హత్య - Female maid murdered in Srikakulam
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-08-2023/640-480-19277528-thumbnail-16x9-female-maid-murder-srikakulam.jpg)
Female Maid Murdered in Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం ప్రజలంతా స్వాతంత్య్ర వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ వెలుగుచూసిన హత్యోదంతం నగరంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎచ్చెర్ల మండలం పొన్నాడకు చెందిన తాళ్లవలస రాజు (35) అనే మహిళ పెద్దపాడు రోడ్డు వీరన్న షెడ్డు సమీపంలోని ఓ విశ్రాంత వైద్యుడి ఇంట్లో 15 ఏళ్లుగా పని చేస్తోంది. అదే ఇంట్లో పోలాకి మండలం జిల్లేడువలసకు చెందిన పనిమమిషి కొట్టు చిట్టెమ్మ కూడా ఉంటోంది. ప్రస్తుతం వైద్యుడు ఇంటిని వీరిద్దరికీ అప్పగించి.. విశాఖలోని కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజు చనిపోయిందని ఇంటి యజమానికి చిట్టెమ్మ ఫోన్ చేసి తెలిపింది. వెంటనే ఆయన శ్రీకాకుళం చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నా పోలీసులు.. ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధమా? లేక ఇద్దరు పనిమనుషుల మధ్య ఏమైనా గొడవ జరిగిందా.., లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అని దర్యాప్తు చేస్తున్నారు.