Farmers Protest Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కదం తొక్కిన రైతులు.. ఎద్దుల బండ్లతో భారీ ర్యాలీ - Farmers Agitation on CBN Arrest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 3:47 PM IST
Farmers Protest With Bull Carts Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. అనకాపల్లి జిల్లాలోని రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యవసాయ పనులు పక్కన పెట్టి తమ అధినేతకు మద్దతుగా.. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లతో ర్యాలీ తీశారు.
జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట గ్రామంలోని రైతులు.. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఎడ్ల బండ్ల శ్రేణులతో ప్రదర్శన చేపట్టారు. సైకో పోవాలి.. రైతులను ఆదుకునే చంద్రబాబు రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక బండి తర్వాత మరో బండి.. రెండు కిలోమీటర్ల వరకు నిరసన ప్రదర్శన.. తమ నాయకుడి అరెస్టుపై రైతుల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఎడ్ల బండ్ల నిరసన ప్రదర్శన అనంతరం గ్రామంలోని కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి టీడీపీ నేత బుద్దా నాగ జగదీశ్వర రావు పూలమాల వేశారు. తర్వాత నిరసన దీక్షలకు పూనుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.