Land Issues: భూముల్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. రోడ్డెక్కిన అన్నదాతలు - complained to the collector about irregularities
🎬 Watch Now: Feature Video
Land issues in visakhapatnam: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణరాజుపేటలో భూ రికార్డుల మార్పిడిలో వైసీపీ నేత పెద్ద ఎత్తున పేరున మార్చేశారని రైతులు ఆరోపించారు. దానికి భీమిలి ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నారని రైతులు, నేతలు ఆరోపించారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్కు రైతులు తమ గోడును రాతపూర్వకంగా అందించారు. గతంలో ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో సైతం తమ ఫిర్యాదులను ఇచ్చామని రైతులు వెల్లడించారు. అయినా తమకు న్యాయ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు ఉదయం నుంచే భీమునిపట్నం మండలం నారాయణరాజుపేట రైతులు పెద్ద సంఖ్యలో విశాఖ కలక్టరేట్కు చేరుకున్నారు. తమ నిరసన వ్యక్తం చేశారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన రైతులను సామూహికంగా స్పందన వద్దకు పంపేందుకు పోలీసులు అనుమతించలేదు. రైతుల తరుఫున ప్రతినిధులుగా కలెక్టరెట్లోకి కొందరిని మాత్రమే పంపారు. దశాబ్దాలుగా రైతుల పేరిట ఉండే భూముల రికార్డులన్నీ హఠాత్తుగా ఆన్లైన్లో వైసీపీ నేత పేరిట ఎలా మారిపోయాయని వారు ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.