Pawan Kalyan Fan: ఉప్పొంగిన అభిమానం.. క్రేన్‌పై వచ్చి పవన్‌కు సన్మానం.. వీడియో వైరల్ - పవన్ ర్యాలీ
🎬 Watch Now: Feature Video
Pawan Kalyan Fan Daring: పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలొస్తాయి. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటే.. ఈయనకు మాత్రమే భక్తులు ఉంటారు. ఎందుకుంటే పవన్‌ను వాళ్లు దేవుడిలా భావిస్తారు. ఆయన ఎక్కడికైనా వస్తున్నారంటే చాలు.. పెద్దఎత్తున తరలివచ్చి ఆయన కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే సోమవారం తిరుపతి జిల్లాలో పవన్ పర్యటించి.. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కోరిన సంగతి తెలిసిందే. కాగా అంతకుముందు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వచ్చిన పవన్.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. తిరుపతి నుంచి ఎస్పీ ఆఫీసుకు జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా వస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆయనపై ఉన్న ప్రేమతో ఓ అభిమాని చేసిన పని ప్రస్తుతం నెట్టింట్లో హాట్‌టాఫిక్‌గా మారింది. క్రేన్‌పై వచ్చి పవన్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.