Fake Medicine Scam Case Investigation ఏపీలో నకిలీ మందులు.. ఐదు జిల్లాల మెడికల్ షాపుల్లో విక్రయాలు.. అప్రమత్తమైన అధికారులు - Fake Medicine Scam Case Updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 6:14 PM IST

Fake Medicine Scam Case Investigation Updates: తినే ఆహారం, వాడే వస్తువులే కాదు.. చివరికి అనారోగ్యం నుంచి బయటపడేందుకు వాడే ఔషధాల్లోనూ భారీ కుంభకోణాలు జరుగుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని ప్రముఖ కంపెనీలు నకిలీ మందులను తయారు చేసి.. మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయిస్తున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అనుమానాస్పదంగా ఉన్న పలు ప్రముఖ కంపెనీల మందులను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పరిశీలించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారు..?, ఈ నకిలీ మందులను ఏయే ఏజెన్సీలు విక్రయించాయి..?, ఏ వ్యాపారి ఈ మందులను సరఫరా చేశారు..? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

కోటి రూపాయల నకిలీ ఔషధాలు గుర్తింపు..! నకిలీ ఔషధాల కుంభకోణం కేసుకు సంబంధించి.. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దర్యాప్తును వేగంవంతం చేశారు. గత రెండు వారాలుగా జరిపిన దర్యాప్తులో.. సుమారు కోటి రూపాయల నకిలీ ఔషధాలు తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నకిలీ ఔషధాలు.. నీల్ కుమార్ అనే మధ్యవర్తి ద్వారా విజయవాడ గొల్లపూడిలోని లక్ష్మీ పద్మావతి ఏజెన్సీస్‌కు సరఫరా అయ్యాయని.. దీని ద్వారా (లక్ష్మీ పద్మావతి ఏజెన్సీస్‌) నెల్లూరు, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు మందులు సరఫరా అయినట్లు అధికారులు నిర్ధారించారు. అనంతరం ఆ ఔషధాలను వెనక్కి రప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ఈటీవీ భారత్ ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.