హోంగార్డు ఉద్యోగాల పేరుతో మోసాలు - కొనసాగుతున్న అరెస్టులు - Scams for name of jobs
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 11:01 PM IST
Fake Home Guard Jobs in Guntur District : హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో అరెస్టులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఏ3గా ఉన్న విజయలక్ష్మి పండిట్, ఏ4గా ఉన్న గొల్లమూడి వెంకటలక్ష్మి, నరసింహ, ఫణికుమార్లను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో మంగళవారం అదుపులోకి తీసుకున్న వీరిని బుధ, గురువారల్లో విచారించారు. అనంతరం గురువారం సాయంత్రం మంగళగిరి న్యాయస్థానంలో వీరిని ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వీరికి 14రోజుల రిమాండ్ విధించారు.
ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పూర్తి వివరాలను 15 రోజుల్లో ఇవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి ఏ8గా ఉన్నారు. ఈ కేసును త్వరగా పూర్తిచేసి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.