Bopparaju Venkateswarlu: భవిష్యత్ తరాల కోసం ప్రతి ఉద్యోగి ముందుకు రావాలి: బొప్పరాజు - బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
Face to face with Bopparaju Venkateswarlu: వేధింపులతో ప్రభుత్వ ఉద్యోగులను ఏమీ చేయలేరని.. సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఒక్కో ఉద్యోగికి లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం బకాయి పడిందని.. తమ ప్రయోజనాలు దక్కించుకునేందుకు ప్రతి ఉద్యోగి ముందుకురావాలని పిలుపునిచ్చారు. వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి గతంలో ఎన్నడూలేదని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గతంలో ఓ వ్యవస్థ ఉండేదని.. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్న బొప్పరాజు.. పీఆర్సీ, డీఏలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని అన్నారు. ఉద్యోగులు అవసరం లేదనే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని.. ఒక్కో ఉద్యోగికి లక్ష నుంచి 4లక్షల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. మౌనంగా ఉంటే భవిష్యత్ తరాలకు పీఆర్సీలు కూడా ఉండబోవంటున్న బొప్పరాజు వెంకటేశ్వర్లుతో.. మా ప్రతినిధి ముఖాముఖి.