AP Employees Association: "రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత లేని సీపీఎస్ అంశంపై కోర్టుకెళ్తాం" - ఏపీ ఉద్యోగుల సంఘం
🎬 Watch Now: Feature Video
Face to Face With Employees: ఎలాంటి రాజ్యాంగబద్ధత లేని సీపీఎస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయటం చట్ట విరుద్ధమని ఏపీ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేవలం జీవో ద్వారానే అమలు చేస్తున్నారని, ఎలాంటి చట్టం చేయలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పష్టం చేశారు. దీన్ని ఏపీ హైకోర్టులో సవాలు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. వారంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని సూర్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు వల్ల వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదని కేఆర్ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. సీపీఎస్‌పై అవగాహన లేకుండా నాడు జగన్ రద్దు హామీ ఇచ్చారని తాము భావించటం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు అన్నారు. సీపీఎస్ చట్టబద్ధతను హైకోర్టులో సవాలు చేస్తామంటున్న ఉద్యోగులతో ఈటీవీ భారత్ ముఖామఖి..