Crispy Bhindi : బెండకాయ, శెనగపిండి మిశ్రమంతో తయారు చేసే "భిండీ కుర్కురే(బెండకాయ కుర్కురే)" కోసం ఉత్తర భారత దేశంలో ఎగబడుతుంటారు. బెండకాయలను నిలువునా చీల్చి శెనగపిండి, మసాలాలు దట్టించి చిప్స్ మాదిరి ఎర్రగా రోస్ట్ చేసే భిండీ కుర్కురే రుచికి ఎంతో మంది ఫిదా. కుర్కురే మాదిరిగానే బెండకాయ ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి కాబట్టే దీన్ని భిండీ కుర్కురే అంటారు. భిండీ కుర్కురేని పప్పు అన్నంలో నంజుకు తింటారు. అందుకే దాల్ చావల్ భిండీ(పప్పన్నం) కుర్కురే అనే కాంబోతో కూడా హోటళ్లలో దొరుకుతుంది.
నాటు కోడి పులుసు ఇలా చేయండి - ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!
ఎంతో రుచికరమైన బెండకాయ కుర్కురే తయారీ చాలా సింపులే అయినా కొన్ని టిప్స్ పాటిస్తే సరి. లేదంటే రుచిలో తేడా వస్తుంది. బెండకాయల ఎంపిక మొదలుకుని, వాటికి మసాలాలు దట్టించి వేయించేదాకా కొన్ని టిప్స్ మీకోసం ప్రత్యేకం.
బెండకాయ కుర్కురే తయారీ కోసం లేత బెండకాయలనే ఎంచుకోవాలి. బెండకాయలు లేతగా ఉంటేనే కరకరలాడుతూ ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి. ఒకవేళ ముదిరిన ముక్కలు అయితే మాత్రం ఎంత వేపినా జిగురుగా ఉంటాయి.
ముందుగా లేత బెండకాయలని మధ్యకి చీరి అందులోని గింజల్ని తీసేయాలి. ఆ తరువాత రెండు అంగుళాల చొప్పున చీరుకోవాలి. చీరుకున్న బెండకాయ ముక్కలకు శెనగపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పట్టించి తరువాత ముక్కలన్నింటినీ ఎగరేస్తుంటే మసాలా మిశ్రమం సమానంగా పట్టుకుంటుందని గుర్తుంచుకోవాలి. మసాలా సరిగా పట్టేందుకు కొద్దిగా నీళ్లు జల్లించుకుంటే సరిపోతుంది. నీళ్లు ఏ మాత్రం ఎక్కువైనా పిండి కాయల నుంచి విడిపోయి బూందీ తయారవుతుంది.
బెండకాయ కుర్కురే తయారీ పదార్థాలు
- 400 గ్రాముల లేత బెండకాయలు
- 3/4 కప్పుల సెనగపిండి
- 1/8 టేబుల్ స్పూన్ వాము
- 1/8 టేబుల్ స్పూన్ జీలకర్ర
- 2.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
- ఉప్పు - రుచికి సరిపడా
- 1/2 టేబుల్ స్పూన్ కారం
- 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా
- 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
- 1 టేబుల్ స్పూన్ వేపిన జీలకర్ర పొడి
- 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా
- 1 చెంచా నీళ్లు
- వేపుకోడానికి సరిపడినంత నూనె
శనగపిండి మసాలా మిశ్రమాన్ని బెండకాయ ముక్కలకి పట్టించిన తర్వాత బాగా మరిగిన నూనెలో వేసుకోవాలి. వెంటనే గరిటెతో తిప్పకుండా రెండు నిమిషాలు వదిలేస్తే ముందు పిండి ఉడికిపోయి ముక్కలని పట్టుకుని ఉంటుంది. ఆ తరువాత నెమ్మదిగా కదిపి తిప్పుకుంటూ రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్ మీద రంగు మారుతున్నప్పుడు హై ఫ్లేమ్ మీద వేపితే ముక్కలు కరకరలాడేట్టు వేగుతాయి. వేపిన బెండకాయ కుర్కురేని చల్లారేదాకా జల్లెడలో వేసి ఉంచాలి.
ఒక్క మొక్కతో వంద లాభాలు - ఇంట్లో కుండీల్లోనూ పెంచుకోవచ్చు
ఘాటైన "వెల్లుల్లి రసం" - వేడివేడి అన్నంతో తింటే జలుబు, పొడిదగ్గు నుంచి రిలీఫ్!