Ex Union Minister Chinta Mohan on Chandrababu Arrest: "రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు.. ఇది ముమ్మాటికీ నిజం" - పాత పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 4:50 PM IST
Ex Union Minister Chinta Mohan on Chandrababu Arrest: రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశారనేది ముమ్మాటికీ వాస్తవమని.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అరెస్టుల రాష్ట్రంగా తయారైందని విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిచాలని అన్నారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. పరిపాలను పక్కనపెట్టిన జగన్... కక్ష రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరెస్టుల ప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉన్నట్లు లేదని.. అది ఇండియన్ పొలిటికల్ సర్వీసుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలు ఎందుకు అని ప్రశ్నించారు. పాత పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.