Ex MPP: సమస్య చెబితే.. స్టిక్కర్ వేసుకొని పోయారు..! ఇదేంటని వాపోయిన వైసీపీ నేత
🎬 Watch Now: Feature Video
Ex MPP Fires on YSRCP Leaders: మా ఇంట్లో వ్యర్థాలను, చెత్తను మేమే పారేసుకోవాలా.. మాకు ఓట్లు లేవా ఏంటి? ఇలా అడిగింది ఎవరో కాదు అద్దంకి మాజీ ఎంపీపీ పద్మావతి. జగనన్న స్టిక్కర్లు ఇళ్లకు అంటించటానికి గృహసారథులు, కన్వీనర్లు, వాలంటీర్లు వచ్చారు. వారిని పలు రకాల ప్రశ్నలు వేసి అద్దంకి మాజీ ఎంపీపీ పద్మావతి నిలదీశారు.
బాపట్ల జిల్లా అద్దంకిలో.. ''మా నమ్మకం నువ్వే జగనన్న'' కార్యక్రమం నిర్వహిస్తున్న గృహసారథులు, వాలంటీర్లు, వైసీపీ నాయకుల బృందానికి.. మాజీ ఎంపీపీ నుంచి నిరసన సెగ తగిలింది. ఇంటింటికీ స్టిక్కర్లు అంటించడానికి వచ్చిన వాలంటీర్లు, గృహసారథులను... వైసీపీకు చెందిన మాజీ ఎంపీపీ పద్మావతి సమస్యలపై నిలదీశారు. మున్సిపాలిటీ కార్మికులు తమ ఇంటి నుంచి చెత్త సేకరించడం లేదని పద్మావతి అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదంటూ.. స్టిక్కర్లు అంటించడానికి వచ్చినవారిని నిలదీశారు. సొంత పార్టీకి చెందినవారి నుంచే ప్రశ్నలు తలెత్తడంతో.. వారికి ఏంచేయాలో దిక్కుతోచలేదు. పురపాలక సంఘం సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి... సమస్య పరిష్కరిస్తామని సర్దిచెప్పారు. ఇంటికి స్టిక్కర్ అంటించి వెళ్లిపోయారు. అద్దంకిలో ఆలయాల ప్రహరీలకు సైతం జగన్ ఫ్లెక్సీలు అంటించడం చర్చనీయాంశమైంది.