వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి : కాలవ శ్రీనివాసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 3:11 PM IST
EX- Minister Kalava Srinivasulu Camplaint on Kapu Ramachandra reddy In Anantapur District : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. కాపు రామచంద్రారెడ్డి అనుచరులపై పెట్టిన క్రిమినల్ కేసుల్లో పురోగతి లేదని ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. కాపు రామచంద్రారెడ్డి అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలపై పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తున్నారని దర్యాప్తు వేగం పెంచాలని ఫిర్యాదు చేశామన్నారు.
Kalava Srinivasulu fires on MLA Kapu Ramachandra reddy : నేమకల్లు క్వారీలో కాపు రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని కాలవ ఆరోపించారు. అన్నింటి పై సమగ్ర విచారణ జరపాలని ఎస్పీని కోరామన్నారు. ప్రతిపక్ష పార్టీగా వారి కర్తవ్యాన్ని వారు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు.