శ్రీకాకుళం నరసన్నపేట వైఎస్సార్సీపీ - చాపకింద నీరులా వ్యతిరేకత - Narasannapeta mla ticket
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2023, 9:08 PM IST
EX Minister Dharmana Krishnadas: వైఎస్సార్సీపీలో అభ్యర్థుల మార్పుపై ఆ పార్టీ శ్రేణులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా స్పందిస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యతిరేకిస్తే మరికొన్ని చోట్ల సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ టికెట్ ఎవరికి ఇచ్చినా వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానంటూ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఒకింత అసహనంగా వ్యాఖ్యానించారు. శనివారం సారవకోట మండలం పెద్దలంబ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తన సమీప బంధువు, సారవకోట ఎంపీపీ చిన్నల కూర్మినాయుడ్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కూర్మి నాయుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వేళ కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవల జగన్ పుట్టినరోజు కార్యక్రమాలను కృష్ణదాస్, కూర్మినాయుడుకు చెందిన వర్గాలు వేరువేరుగా నిర్వహించాయి. ఇప్పటికే కూర్మినాయుడు అనుచరులు కృష్ణదాస్‌కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా కృష్ణ దాస్ వ్యతిరేకవర్గం వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. కృష్ణదాస్ వ్యాఖ్యలు, నియోజకవర్గంలోని పరిస్థితులను పరిశీలిస్తే వీరిద్దరి మధ్య ఉన్న వ్యతిరేకత అర్థం అవుతోంది.