EX CJI Justice NV Ramana: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ సేవలకు అమెరికాలో ప్రశంస..
🎬 Watch Now: Feature Video
EX CJI Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ చేసిన కృషిని అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్ర సెనేట్, జనరల్ అసెంబ్లీ ప్రశంసించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ సీజేగా.. ఆయన అనేక సంస్కరణలను అమలు చేశారని ప్రశంసిస్తూ.. ఉమ్మడిగా తీర్మానపత్రం విడుదల చేశాయి. జస్టిస్ రమణ కీలకమైన కేసుల్లో సమర్థవంతంగా తీర్పులు వెలువరించారని... కోర్టుల్లో న్యాయ నియామకాలను పెంచడంతో పాటు.. పెండింగ్ కేసులకు వేగవంత పరిష్కారం చూపడంలో విశేష కృషి చేశారని.. కీర్తించాయి. భారత న్యాయవ్యవస్థపై జస్టిస్ రమణ చెరగని ముద్ర వేశారని.. కోర్టు వ్యవహారాలకు సంబంధించి మీడియా కవరేజిని విస్తృతం చేశారని తీర్మానపత్రంలో వివరించారు. జస్టిస్ ఎన్‌వీ రమణ అసాధారణ దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని.. ప్రజాజీవితంలోని వారందరికీ ఆయన మార్గదర్శకులని కొనియాడాయి. జస్టిస్ రమణ సేవ, నాయకత్వాన్ని అభినందిస్తూ తీర్మానించాయి. సెనేటర్ డైగ్నాన్, అసెంబ్లీ సభ్యుడు కరాబిన్‌చయాక్, స్టాన్లీ తీర్మానం ప్రవేశపెట్టగా.. సంయుక్త తీర్మానపత్రంపై సెనేట్ ప్రెసిడెంట్ నికోలస్ పి.స్కూటరి, జనరల్ అసెంబ్లీ స్పీకర్ క్రెయిగ్ జె.కాగ్లెన్ సంతకాలు చేశారు.