Prathidhwani సర్కారుకు కనిపించని.. కౌలు రైతు కష్టాలు.. - latest Prathidhwani
🎬 Watch Now: Feature Video
Plight of tenant farmers: కౌలు రైతుల సమస్యలు.. సర్కారుకు వినిపించడంలేదా..? ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో అన్నివైపుల నుంచి వినిపిస్తోన్న ప్రశ్నఇది. రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విపక్షాలు ఇదే విషయంపై జగన్ సర్కార్‌కు వరస ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇటీవల అకాలవర్షాలు.. ఈ బక్కరైతుల కన్నీటిచిత్రాన్ని మరోసారి అందరి ముందు చర్చకు పెట్టింది? మరి వీరందరి ఆవేదనకు కారణం ఏమిటి? అసలు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది కౌలురైతులు ఉన్నారు అనే అంశంపై స్పంష్టత రావాల్సి ఉంది. వారిలో ఎంతమంది ఈ ప్రభుత్వం గుర్తింపునకు నోచుకుంటున్నారు? మొత్తంగా గడిచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో వ్యవసాయరంగంపై వైసీపీ సర్కారు విధానాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో కౌలురైతుల్ని గుర్తించడం ఎందుకింత సంక్లిష్టంగా మారుతోంది. వాలంటీర్ వ్యవస్థనే తీసుకుంటే 50 ఇళ్లకొకరు ఉన్నారు. ఐనా కౌలురైతులు ఎవరో ఎందుకు గుర్తించలేక పోతున్నారు? వైసీపీ ప్రభుత్వం కౌలురైతుల కోసం తెచ్చిన పంటసాగుదారుల హక్కు చట్టం - సీసీఆర్సీ కార్డుల వల్ల ఏం ప్రయోజనం కలిగింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.