Prathidhwani పార్టీలు ఉచితాలు ప్రకటించకుంటే ప్రజలు వారిని ఆదరించే పరిస్థితి లేదా
🎬 Watch Now: Feature Video
దేశ సంక్షేమం, అభివృద్ధికి ప్రధాన శత్రువులు ఉచిత పథకాలు. ప్రధానమంత్రి మోదీ చేసిన ఈ వాఖ్యలు మరోమారు చర్చకు దారితీశాయి. గతంలో సుప్రీంకోర్టు కూడా ఉచిత హామీలపై విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ వ్యాఖ్యలు చాలా పదునుగా ఉన్నాయి. కొన్ని పార్టీలు ఉచిత హామీల పేరుతో పన్ను చెల్లింపుదారులను లూటీ చేస్తున్నాయని, దేశ భవిష్యత్‌ను పణంగా పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని. ఇది నిజంగా దేశ పౌరులు అందరూ చర్చించాల్సిన అంశం. కొందరు కష్టపడి పన్నులు కడుతుంటే వాటిని ఓటు బ్యాంకులుగా మలుచుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అనే వాటికి వక్రభాష్యం చెబుతున్నాయి. సంపద సృష్టించటానికి బదులు పంపిణీలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉచిత పథకాలు ఎంతవరకు సముచితము.. ఏది అనుచితము. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST