బాపట్లను కప్పేసిన మంచు దుప్పటి
🎬 Watch Now: Feature Video
Effect of Fog in Bapatla District : బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్ఛూరు, మార్టూరు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలముకుంది. చీరాలను మంచు దుప్పటి పూర్తిగా కప్పేసింది. మంచు ప్రభావంతో ఎదురెదురుగా వస్తున్న వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు.పొగమంచు కారణంగా ఒంగోలు - దిగమర్రు, కలెకత్తా - చైన్నై జాతీయ రహదారిల్లో కొన్ని వాహనాలు రోడ్డుప్రక్కనే నిలిపివేశారు.
Locals Suffering From Fog : ఉదయం 8 అవుతున్న భానుడు కనిపించకపోవడంతో స్థానికులు రోడ్డుపైకి రావడానికి విముఖత చూపుతున్నారు. దట్టమైన పొగమంచుతో రోడ్లులన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. అత్యవసర పనుల మీద వెళ్లే వాళ్లు భయం భయంగానే రోడ్లుపై ప్రయాణం చేస్తున్నారు. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఈ మంచు కారణంగా తమ పంట పొలాలు ఎక్కడ దెబ్బతింటాయో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగమంచు కారణంగా ఉష్ణోగ్రతలు క్షీణీంచి చలితీవ్రత పెరగడం వల్ల ఉదయం 8 వరకు స్థానికులు ఇంటికే పరిమితం అవుతున్నారు.