ETV Bharat / offbeat

దేశంలోనే అతి చిన్న రైలు ఏమిటో తెలుసా? - కేవలం మూడు బోగీలతో ప్రయాణం! - SMALLEST TRAIN IN INDIA

దేశంలో అతి పెద్ద 'వాసుకి' రైలుకు 295బోగీలు - ఎన్నో విశేషాలు కలిగిన భారతీయ రైల్వే

smallest_train_in_india
smallest_train_in_india (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 5:12 PM IST

SMALLEST TRAIN IN INDIA : అతి పెద్ద రైలు, అతి చిన్న రైలు, అతి పొడవైన మార్గం, అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు, తక్కువ దూరం వెళ్లే రైలు, వేగంగా ప్రయాణించే రైలు ఇలా భారతీయ రైల్వే ఎన్నో విశేషాలను కలిగి ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దైన భారతీయ రైల్వే కేవలం మూడు బోగీలున్న రైలును కూడా నడిపిస్తోంది. దేశంలోనే అతి చిన్న ప్యాసింజర్ రైలు ఇదే కావడం విశేషం. ఇంతకీ ఆ రైలు ఎక్కడుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది? ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో విశేషాలు తెలుసుకుందామా!

రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు

ప్రయాణికులను తరలించే రైళ్లకు సాధారణంగా 18 నుంచి 22 బోగీలు ఉంటాయి. ఇక సరుకులు రవాణా చేసే గూడ్స్ ట్రైన్స్​కు 50 - 60 బోగీలు ఉండొచ్చు. పలు సందర్భాల్లో అదనంగా మరో పది బోగీల వరకూ లింక్​ చేయొచ్చు. కానీ, ఇప్పుడు చెప్పుకునే రైలుకు 3 బోగీలు మాత్రమే ఉన్నాయి. ఈ రైలు కేరళ రాష్ట్రంలో సేవలు అందిస్తోంది. కొచ్చిన్ హార్బర్ టెర్మినల్ నుంచి ఎర్నాకుళం జంక్షన్ వరకు ప్రయాణికులను తరలిస్తుంది. కేవలం మూడు బోగీలు మాత్రమే కలిగి ఆకుపచ్చని రంగులో ఉండే ఈ డెమూ రైలులో 300 మంది ప్రయాణించే వీలుంది. రోజూ రెండుసార్లు, ఉదయం, సాయంత్రం నడుస్తుంది. ఒకే స్టాప్‌తో 40 నిమిషాల్లో కేవలం 9 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.

ఉత్తర ప్రదేశ్​లో మరో రైలు

ఉత్తరప్రదేశ్ లోని ఐత్ కొంచ్ షటిల్ రైలు కూడా మూడు బోగీలు కలిగిన అతి చిన్న రైలుగా నమోదైంది. కొంచ్ నగర్ నుంచి జలౌన్ సర్సౌకి స్టేషన్ వరకు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. స్టేషన్లలోనే కాకుండా మార్గ మధ్యంలో ఎక్కడ చెయ్యొత్తినా రైలు ఆపడం ఈ రైలు విశేషం.

శేషాచలంలో కలివి కోడి - 'ఈ పక్షిని కనిపెట్టిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం!'

అతి పెద్ద రైలు ఇదే

దేశంలోనే అతి చిన్న రైలుకు ముడు బోగీలు మాత్రమే ఉండగా 295 బోగీలతో మరో గూడ్స్ అతి పెద్ద రైలుగా నమోదైంది. దాదాపు 300 బోగీలతో కదిలే దీని ప్రయాణం పై నుంచి చూస్తే నేల మీద భారీ అనకొండ పాకుతోందా! అన్నట్టుగా ఉంటుందట. ఈ రైలు పేరు వాసుకి. ఈ రైలును సరకు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. 295 బోగీలతో దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును లాగడానికి 6 ఇంజిన్లు ఉన్నాయి. వాసుకి రైలు దేశంలోని పలు గనుల నుంచి బొగ్గు రవాణా చేస్తుంది. బొగ్గు గనులు అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తుంది. ఈ రెండు నగరాల మధ్య సుమారు 11.30 గంటల జర్నీ ఉంటుంది.

వాసుకి అనే పేరు ఎందుకు పెట్టారంటే ?

మహా శివుడి మెడలో ఉన్న పాము పేరు వాసికి. వాసుకి అంటే దేవ దానవులు పాల సముద్రాన్ని చిలికినపుడు ఈ వాసుకి పాము తాడులా ఉపయోగపడిందట. అలాంటి వాసుకి పేరునే ఈ పొడవైన రైలుకు పెట్టారు.

LIC 'అన్‌క్లెయిమ్డ్‌ మనీ' రూ.800కోట్లు - మీ డబ్బు కూడా ఉందేమో చెక్‌ చేసుకోండిలా!

అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.