Minister Botsa Political comments: "వైఎస్సార్సీపీలో అందరూ గూండాలేనా.. నేను రౌడీనా..? గూండానా..?" - పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహన లేని వ్యక్తి
🎬 Watch Now: Feature Video
Minister Botsa Political comments: రౌడీలు, గూండాలు లేని రాష్ట్రంగా ఏపీని రూపుదిద్దుతామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు అదుపులో లేవు కదా అని ఇప్పుడు అదే విషయాన్ని వేలెత్తి విమర్శించే వ్యక్తులం కాదు.. మా బాధ్యత మేం నిర్వర్తిస్తున్నాం.. మహిళలు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. గతంలో శాంతి భద్రతలు ప్రస్తుతం కంటే దారుణంగా ఉండేవన్నారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు నిర్మించామని చంద్రబాబు చెబుతున్నారని.. మరెందుకు ప్రజలకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ అవగాహన లేని వ్యక్తి అని బొత్స విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులంతా గూండాలు అంటే.. నేను గూండానా, రౌడీనా..? నా మీద కేసులున్నాయా..? ఆయన మాటలపై ఇంతకంటే స్పందించదలచుకోలేదని బొత్స స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శాంతి భద్రతలకు ఎలాంటి ప్రమాదం లేదన్న బొత్స.. వైఎస్సార్సీపీ బీసీల పార్టీ అని, సీఎం జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వచ్చినా తాము ఒంటరిగానే వెళ్తామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, సంయమనం వహించాలని కోరారు.