Dussehra Sharannavaratri Celebrations at Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు.. రెండోరోజు శ్రీగాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు
🎬 Watch Now: Feature Video
Dussehra Sharannavaratri Celebrations at Indrakeeladri: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర ఆలయం(Durga Malleswara Temple)లో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు శ్రీగాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4గంటల నుంచి రాత్రి 11వరకు భక్తులకు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. తొలిరోజు అధికంగా భక్తులు రావడంతో కట్టుదిట్టంగా క్యూ నిర్వహించారు. ఈనెల 23వరకు ఉదయం 4గంటల నుంచే అమ్మవారి దర్శనం కలిస్తున్నట్లు ఆలయ శాఖ అధికారులు తెలిపారు.
ఆదివారం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో(Indrakeeladri kanaka Durgamma Temple) అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి వేడుకల్లో(Dussehra Sharannavaratri celebrations) బాలాత్రిపురసుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయంలో తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazir) సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. తొలిరోజే సుమారు లక్షన్నర మంది భక్తులు అమ్మవారి సేవలో తరించారు. ఈ ఉత్సవ తొమ్మిది రోజులు రోజుకొక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.