Drugs Caught in Vijayawada బెంగుళూరు టూ రాజమండ్రి డ్రగ్స్ రవాణ.. విజయవాడ పోలీసుల అదుపులో నిందితుడు - drugs control administration
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 10:19 AM IST
Drugs Caught in Vijayawada : బెంగళూరు నుంచి రాజమహేంద్రవరం తరలిస్తున్న 3.42 గ్రాముల మిథైల్ ఎన్‌డాక్సీ మెథాఫెటామైన్ (M.D.M.A) మత్తుమందును విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణలంక పోలీసులు ఈ నెల 29న బస్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో.. బెంగళూరు బస్సులు నిలుపుదల చేసే ప్లాట్‌ఫారం నంబర్ 7వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడిని అదుపులోకి విచారణ చేపట్టారు. నిందితుడు రాజమహేంద్రవరానికి చెందిన అభిషేక్‌వర్మగా నిర్ధారించారు. నిందితుడు రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో 28వ తేదీన రాత్రి బెంగుళూరులో బస్సెక్కాడు. 29వ తేదీ ఉదయం బస్సు విజయవాడ బస్ స్టేషన్ చేరుకున్న క్రమంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోనికి తీసుకున్న నిందితుడికిగానీ, అతడు కొనుగోలు చేసిన ప్రదేశానికి, తీసుకెళుతున్న ప్రదేశానికి విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు .