Drinking water Problem in Ananthapur ఇంకా తాగునీటి కష్టాలా..! పాలకులు.. కాస్త దృష్టి పెట్టండి..! - AP Latest News
🎬 Watch Now: Feature Video

Drinking water Problem in Ananthapur బిందెలు పట్టుకుని కి.మీ దూరం నడచివెళ్తున్న ఆ గ్రామీణులను చూస్తే.. తాగునీటి కోసం ప్రజలు ఇంకా ఇన్ని అవస్థలు పడుతున్నారా..! అన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోను వ్యక్తమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఒంటిపాళ్యం గ్రామంలొ గత నెలరోజులుగా మంచినీటి కొరత ఏర్పడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కోసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే మేము నీటి కోసం పనులు మానుకొని విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు రైతుల బోరుబావుల వద్ద నీరు తెచ్చుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న మోటరు మరమ్మతుకు గురై నెలలు గడుస్తున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా కనిసం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక్కడ ఓ గ్రామం, ప్రజలు ఉన్నట్టు గుర్తించండి మహాప్రభో అంటూ అధికారులను, పాలకులను ప్రశ్నించారు. సమస్య తీర్చకుండా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి గ్రామంలోకి వస్తే తగినబుద్ది చెబుతామన్నారు. ఈ నీటి సమస్య గురించి ఎంతమంది వద్ద మొరపెట్టుకున్నా.. నెలలు గడుస్తున్నా నీటి సమస్య మాత్రం తీరట్లేదని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.