అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణుల ఆందోళనలు - తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 4:24 PM IST
Drinking Water Problem in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఉరవకొండ పట్టణంతో పాటు చుట్టపక్కల ఉన్న గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు డిమాండ్ చేశారు. డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణాంగానే తాగునీటి సమస్య ఏర్పడిందని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. తక్షణమే హెచ్ఎల్సి కాలువలో రింగ్ బండను వేసి సమ్మర్ స్టోరేజ్లకు నీటిని పంపింగ్ చేయాలని కోరారు.
ఇప్పుడే ఇలా ఉంటే ఇక వేసవిలో తాగునీటి సమస్య తీవ్ర తరంగా మారనుందని తెలిపారు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో.. అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి తాగు, సాగునీటిపై ఎలాంటి స్పందనే లేదని దీనికి సంబంధించిన వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.