విజయవాడలో అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ - Janata Minority Morcha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:51 PM IST
Door Distribution Program of Rama Akshinthalu in Vijayawada : భారతీయ జనతా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో అయోధ్య రాముడి అక్షింతలను విజయవాడలో ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముస్లింలు, జైన్లు ఇతర అల్ప సంఖ్యాక వర్గాల సమక్షంలో చుట్టిగుంట వినాయకుడి గుడి వద్ద రాముని అక్షింతలకు పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి రాముని అక్షింతలను, అయోధ్య రామమందిరం చిత్రపటం, కరపత్రాన్ని అందించారు.
Bharatiya Janata Minority Morcha : జనవరి 22న అంగరంగ వైభవంగా రాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అయోధ్యలో జరగనున్న నేపథ్యంలో విజయవాడలో అక్షింతల కార్యక్రమం నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలు చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అక్షింతలు అందచేశారు. మత సామరస్యం, సమధర్మం, సమాజాభివృద్ధి, మనిషిని మనిషి గౌరవించుకోవడం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి లక్షణాలు కలిగిన భారతదేశం అని మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్బాజీ పేర్కొన్నారు. తానీషా కాలం నుంచి శ్రీరాముని కల్యాణంనకు ముత్యాల తలంబ్రాలు వెళ్లేవాని గుర్తు చేశారు. హిందు సోదరుల దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమం తాము జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.