Dommetivaripalem Village Road Problems: మూడు దశాబ్దాలైనా.. గ్రామాన్ని పట్టించుకోని ప్రభుత్వం - దొమ్మేటి వారిపాలెంలోని ప్రజల సమస్యలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 10:06 PM IST
Dommetivaripalem Village Road Problem: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని దొమ్మేటివారిపాలెం ప్రాంతంలోని ప్రజలు అత్యంత దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వస్తే ఆ ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు ఇళ్ల కోసం స్థలాలను కేటాయించి.. ఆ ప్రాంతానికి ఇందిరమ్మ కాలనీగా పేరు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో కనీసం రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. దీనికితోడు వర్షాలు కురిస్తే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని.. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ అంశం గురించి ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు తెలియజేసిన వారు పట్టించుకోవటంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.