Bribe For postmortem డబ్బులిస్తేనే పోస్టుమార్టం అన్న ప్రభుత్వ వైద్యుడు.. ఆందోళనకు దిగిన బాధితులు
🎬 Watch Now: Feature Video
Doctor Demanded 5000 bribe for Postmortem: చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం చేయడానికి రూ. 5000 వైద్యులు డిమాండ్ చేసిన దౌర్బాగ్యమైన ఘటన పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో చోటుచేసుకుది. పట్టణానికి చెందిన రాజవరపు ఈశ్వర్(25) దాచేపల్లి మండలం నడికుడి రైల్వే బ్రిడ్జి దగ్గర గత రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం చేయకుండా.. మృతదేహాన్ని ఇవ్వకుండా.. ఐదువేల రూపాయల లంచం ఇస్తేనే మృత దేహం ఇస్తామని లేదంటే ఇవ్వము అని వైద్యులు బహిరంగంగా చెప్పారు. గత రాత్రి 11 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలయినా డాక్టర్ సుధీర్ మృతదేహాన్ని ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఈశ్వర్ బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున గురజాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం చేస్తున్నట్లు తెలపడంతో వారు శాంతించారు.
నడికుడి రైల్వే బ్రిడ్జి దగ్గర రెండు లారీలు ఢీ కొట్టడం ద్వారా ఈశ్వర్‌కు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి ఫోేన్ చేసినా.. కాని గంట వరకు ఒక్క అంబులెన్సు కూడా రాలేదు. చివరికి గురజాల సీఐకి కాల్ చేస్తే ఆయన ఒక లేడీ ఎస్సైని పంపించారు. అనంతరం ఓ ఆటోలో మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాము. అక్కడ డాక్టర్ సుధీర్ పోస్టుమార్టం చేయడానికి రూ. 5000 లంచం అడిగారు. -మృతుని బంధువు