వైసీపీ నేతల బెదిరింపులకు యువ వైద్యుడు బలి - పురుగుల మందు తాగి ఆత్మహత్య - కాకినాడ జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 12:31 PM IST
Doctor Suicide in Kakinada: వైసీపీ నాయకుల బెదిరింపులకు కాకినాడ అశోక్‌నగర్‌లో వైద్యుడు శ్రీకిరణ్ చౌదరి(32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతిచెందారు. ఆస్తి విషయంలో ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు, సినీ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, మరో అనుచరుడు పెదబాబు, వైసీపీ నేతలు తన కుమారుడిని మోసం చేశారని మృతుడి తల్లి రత్నం ఆరోపించారు.
Doctor Commits Suicide Due to Threats from YCP Leaders: భూ వివాదం పరిష్కారానికి(Land Dispute Settlement) తన కుమారుడు.. వైసీపీ నేతలను ఆశ్రయిస్తే.. భూమి పత్రాలు(Land documents) తీసుకుని డబ్బు రాదని చెప్పారని వైద్యుడి తల్లి తెలిపారు. వారి బెదిరింపులతోనే మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. దీనికి కారణం ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్(MLA Kannababu Brother Kalyan) అని వైద్యుడి తల్లి ఆరోపించారు.