Distribution of Pushcarts: నారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. పేద ప్రజలకు తోపుడు బండ్లు పంపిణీ - భాష్యం ప్రవీణ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-07-2023/640-480-18909581-697-18909581-1688452050658.jpg)
Distribution of Pushcarts: నారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాష్యం ప్రవీణ్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 36 మంది పేద ప్రజలకు టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు పంపిణీ చేశారు. స్వయం ఉపాధి కోసం ఆరు అల్పాహార బండ్లు, 30 తోపుడు బండ్లను సోమవారం పంపిణీ చేశారు. పట్టణంలో కాయకష్టం చేస్తూ.. బతుకుతున్న బడుగు, బలహీనవర్గాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. వారి ఆర్థిక స్థితిగతులను వారే మార్చుకుని సమాజంలో గౌరవంగా జీవనం కొనసాగించాలనే ఓ గొప్ప ఆలోచనతో భాష్యం ప్రవీణ్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నారా ఫౌండేషన్ వద్ద నుంచి తోపుడు బండ్లు అందుకున్న పేదలు.. మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలు దగ్గుమల్లి సాంబశివరావు, కేతినేని మల్లికార్జున్, అబ్దుల్ మజీజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదే విధంగా నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో టీడీపీ పేద కార్యకర్తల కుటుంబాలకు నారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5.65 లక్షల సాయాన్ని సోమవారం అందజేశారు. 113 మందికి 5 వేల చొప్పున మాజీ సర్పంచి యన్నం వెంకట్రామిరెడ్డి, ఇతర టీడీపీ నాయకులు దగ్గుమల్లి సాంబశివరావు, విడపలపాటి వాసు అందజేశారు.